Category: జిల్లా వార్తలు

భూముల రీసర్వేను పరిశీలించిన తహసీల్దార్ పుష్పలత

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 5 : మండలంలోని పరడ గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను గురువారం తహసీల్దార్ పుష్పలత పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని సూచించారు. సర్వే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి…

సింగిల్ విండో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలి..రైతులకు ఓటు హక్కు కల్పించాలి: సిద్ధగొని రమేష్ గౌడ్

వెల్దండ: తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సింగిల్ విండో) చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులను నామినేటెడ్ విధానంలో కాకుండా, ఎన్నికల ద్వారా భర్తీ చేయాలని అజిలాపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ వెల్దండ మండల వైస్ ప్రెసిడెంట్ సిద్ధగొని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.సహకార సంఘాల పాలకవర్గాలను రైతులే తమ ఓటు హక్కుతో ఎన్నుకునే అవకాశం కల్పించాలని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు. రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్…

ర్యాగింగ్ ఘటనకు బాధ్యత వహిస్తూ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ర్యాగింగ్‌కు పాల్పడిన 14 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం మాత్రమే సరిపోదని, ఘటనకు బాధ్యత వహిస్తూ కళాశాల ప్రిన్సిపాల్, డిప్యూటీ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, డిప్యూటీ వార్డెన్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపాల్ చాంబర్‌లో సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు…

బ్రహ్మాజీవాడి పాఠశాల భవన నిర్మాణానికి రూ.27.10 లక్షల నిధులు మంజూరు – ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం

తాడ్వాయి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవతో తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల భవన నిర్మాణానికి నాబార్డ్ (NABARD) పథకం కింద రూ.27.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు…

రెండేళ్ల నిరీక్షణకు తెర.. తాడ్వాయికి నూతన డిప్యూటీ తహశీల్దార్!

తాడ్వాయి మండల రెవెన్యూ కార్యాలయంలో గత రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్న డిప్యూటీ తహశీల్దార్ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది. గ్రూప్‌-2 పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించిన శృతి గురువారం తాడ్వాయి మండల నూతన ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్న ఆమె, తహశీల్దార్ శ్వేతను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రెండేళ్లుగా కీలక పోస్టు ఖాళీగా ఉండటంతో రెవెన్యూ సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి….

చల్లపల్లిలో ఘనంగా విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు

వెల్దండ, నవంబర్ 05:వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లి గ్రామంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమాని చిన్నారి సాయి హర్షిత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. చిన్నారులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.క్రికెట్లో చేజ్ మాస్టర్ గా పేరు సంపాదించుకొని దేశ క్రికెట్ జట్టు విజయం కోసం నిరంతరం కృషి చేస్తున్న విరాట్ కోహ్లీ మీద తమకున్న అమితమైన అభిమానాన్ని ఈ వేడుకల ద్వారా చాటుకున్నారు….

పేద బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో ముస్తాపూర్ గ్రామంలో రెండు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ, అర్హులైన పేద బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించడం లేదని ఆరోపిస్తూ గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, పేద బీఆర్‌ఎస్ కార్యకర్తలకు కూడా…

అన్నాసాగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్

ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎల్లారెడ్డి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24,600 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదానికి…

క్రీడల్లో ఆర్.ఆర్. హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ..

రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థినుల ఎంపిక…కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీల్లో ఆర్.ఆర్. హైస్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన అండర్-14 బాలికల అథ్లెటిక్స్ లాంగ్ జంప్ విభాగంలో పి. నిహారిక రజత పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అదేవిధంగా అండర్-17 బాలికల విభాగంలో టి. మధుప్రసన్న తెలంగాణ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి…

గుండ్లపోచంపల్లిలో గంజాయి కలకలం: 3.32 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

గుండ్లపోచంపల్లిలోని 3.323 కిలోల బరువున్న మూడు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.