Category: జిల్లా వార్తలు

పోతేపల్లి పట్టభద్రుల ఓటర్ల నమోదు.. తహసీల్దార్‌కు దరఖాస్తుల అందజేత

వెల్దండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పట్టభద్రుల ఓటర్ల వివరాలను నమోదు చేసి, సంబంధిత దరఖాస్తులను మంగళవారం వెల్దండ తహసీల్దార్‌ బీశ్వ కార్తీక్ కుమార్ కు అందజేశారు.మండల బీఆర్ఎస్ యువ నాయకులు అంజి మాస్టర్,పోతేపల్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి మంగళపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో, పోతేపల్లి ఉపసర్పంచ్ శారదా బాలయ్య గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ…

రక్తదానం ప్రాణదానంతో సమానం : నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి

రక్తదానం ప్రాణదానంతో సమానం : నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 2 : రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడంచంచని నల్లగొండ డీఎస్పీ శిరాంరెడ్డి అన్నారు. సోమవారం కట్టంగూర్ లో బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభల రెండవ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు, అత్యవసర వైద్య…

జీవో 25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదు..

జీవో 25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదు..టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 2: జీవో నెం.25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ అన్నారు. సోమవారం కట్టంగూర్‌లో జరుగుతున్న టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఏడో మహాసభల రెండో రోజు జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన నిర్వహించిన ప్రతినిధుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు….

అయిటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి..మరొకరికి తీవ్రగాయాలు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం

అయిటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి..మరొకరికి తీవ్రగాయాలుబైక్ పై వెళ్తుండగా ప్రమాదంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 2 : మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో జాతీయ రహదాలపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నగడ్డల వాసు(22), అతని సోదరుడు జొన్నగడ్డల ప్రశాంత్ (21)లు గత కొంత…

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి.. గాజులగూడెంలో విషాదఛాయలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లకొండ నర్సింలు, ఆయన భార్య ఎల్లకొండ మౌనిక కంది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం...

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బీజేవైఎం నాయకులు

కల్వకుర్తి:భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కల్వకుర్తి మండలంలోని కురుమిద్ద గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు, ఇతర పోషకాహారం సక్రమంగా అందిస్తున్నారా లేదా అనే విషయాలను తనిఖీ చేశారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు పలకలను పంపిణీ చేశారు. చిన్నారులను సొంత పిల్లల్లా ఆప్యాయంగా చూసుకుంటూ, వారి అభివృద్ధికి కృషి చేస్తున్న…

నర్సుల కొరతతో వెల్దండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు

వెల్దండ నవంబర్ 02 :వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోజుకు 120 మందికి పైగా రోగులు వస్తున్నప్పటికీ,ముగ్గురు నర్సులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తుండటంతో వైద్య సేవలపై పని భారం పెరుగుతోందని ఆసుపత్రి పర్యవేక్షకుడు మురళీకృష్ణ తెలిపారు.ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలకు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు. ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని…

ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా హాజరు.. ఎమ్మెల్యే కసిరెడ్డి

వెల్దండ నవంబర్ 02: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిర్వహించిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు హాజరైనట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత, ఓటర్ల జాబితాల సవరణలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లకు అనుమతి లభించకపోవడంతో బస్సులు, కార్లు, ఇతర…

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం

ఆరు నెలల పసికందుకు తండ్రిని దూరం చేసిన రోడ్డు ప్రమాదంవెల్దండ,నవంబర్ 2: గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మృతి చెందిన ఘటన వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జాజాల గ్రామానికి చెందిన బేతర్ వెంకటేష్ (30) గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని మీర్‌పేటలో నివాసముంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 7 గంటల సమయంలో పెద్దాపూర్…

మురాసు తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తహసిల్దార్ కార్తీక్ కుమార్

వెల్దండ:మురాసు తుఫాన్‌ ప్రభావంతో నవంబర్ 3 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దండ తహసీల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ సూచించారు. సోమవారం వెల్దండ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించారు. వర్షాల సమయంలో చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ…