అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన వెల్దండ.. 41 రోజుల మండల దీక్షకు శ్రీకారం!
వెల్దండ: మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప ఆలయ ఆవరణలో పెద్దలు, యువకులు, చిన్నారులు సంప్రదాయబద్ధంగా అయ్యప్ప మాలలు ధరించి 41 రోజుల దీక్షను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని భక్తిమయంగా మార్చారు. మండల దీక్షలో భాగంగా నియమనిష్ఠలతో సాత్విక జీవనం గడుపుతూ, నిత్యం పూజలు, భజనలు నిర్వహిస్తామని స్వాములు తెలిపారు. కార్తీక మాసంలో శబరిమల యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.మాలధారణ కార్యక్రమంలో భక్తులు…
