Daily Archive: November 16, 2026

తల్లి గర్భంలోనే శిశువుకు శస్త్రచికిత్స..

న్యూఢిల్లీ : వైద్య విజ్ఞానం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు శస్త్రచికిత్స నిర్వహించి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. సుమారు 25 వారాల గర్భస్థ శిశువుకు వెన్నెముకలో ఏర్పడిన తీవ్రమైన లోపాన్ని...

చిన్న, మధ్యతరహా పత్రికల సమస్యలపై మేధోమథనం

హైదరాబాద్: జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని పత్రికా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న, మధ్యతరహా పత్రికల మనుగడ, జర్నలిస్టుల సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణపై జర్నలిస్టులు, సంపాదకులు మేధోమథనం చేశారు. నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆడిటోరియంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్...

డేటింగ్ యాప్‌తో వల.. మత్తుమందు ఇచ్చి దోపిడీలు

మల్కాజిగిరి: గ్రైండర్ డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, బాధితులకు మత్తు పదార్థాలు కలిపిన బీరు ఇచ్చి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకుంటున్న ఐదుగురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా బాధితుల వివరాలు సేకరించి, ఇళ్లకు వెళ్లి నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం పోలీస్ పరిధుల్లో మొత్తం 14 కేసులతో వీరికి సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రజలు అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని,…

పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు – సర్పంచ్ వెంకటయ్య.!

ఆమనగల్ నవంబర్ 16 :ఆమనగల్లు మండల అభివృద్ధి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పోలేపల్లి సర్పంచ్, మండల సర్పంచుల సంఘం కార్యదర్శి వెంకటయ్య కోరారు. ఆదివారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జయరాం విజయ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన పోలేపల్లి గ్రామ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ చైర్మన్ గూడూరు శ్రెరీనివాస్ డ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలేపల్లి…

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం!

వెల్దండ, నవంబర్ 16 :రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుందని బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఈ పథకం తోడ్పడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం…

అర్హులకు ఆసరా పింఛన్ల పంపిణీ – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16 :వెల్దండ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు,గీత కార్మికులకు పింఛన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులకు పింఛన్లు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషితో అర్హులకు సంక్షేమ పథకాలు…

కేశవ నగర్ కాలనీలో సుంకిరెడ్డి హైమాస్ట్ వెలుగులు.!

జ్ఞాన తెలంగాణ ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16 :కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కేశవ నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తన సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. రాత్రివేళల్లో వెలుతురు లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఈ ఏర్పాట్లు చేపట్టారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రామకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు…

పత్తి పంట నాశనానికి కుట్ర.. దాయాదుల ఆరోపణలు.!

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16:కురుమిద్ద గ్రామంలోని వారసత్వ భూ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తమ పత్తి పంటను నాశనం చేసేందుకు శీను,మల్లేష్ ప్రయత్నిస్తున్నారని దాయాదులు సుల్తాన్,భాస్కర్, సాయి, బాలస్వామి, వెంకటయ్య ఆరోపించారు. ఈ మేరకు ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు.సర్వే నంబర్లు 140,136/ఆ/ఆఇ1లో భూమికి సంబంధించి కోర్టులో వివాదం కొనసాగుతోందని, వరి కోత యంత్రాన్ని తమ పత్తి పంట మీదుగా తీసుకెళ్లి పంటను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు….

జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఎన్నికైన TV9 పవన్ రెడ్డిని సన్మానించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి

పరిగి ఇటీవల వికారాబాద్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా ఎన్నికైన TV9 రీపోటర్ పవన్ రెడ్డి సన్మానించి వారికీ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాక్ రవి,శ్రీనివాస్, వారల రవీంద్ర,నరేష్ నాయకులు భాస్కర్,రాజు,తాహెర్అలీ, బాలల, రాకేష్, సాయి తేజ, ఆసిఫ్,పరిగి మండల నాయకులు పాల్గొన్నారు 

మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం.!

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16: వెల్దండ మండలంలోని ఓ కుటుంబానికి ఆపద సమయంలో వెల్దండ సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కరరావు ఆర్థిక చేయూత అందించారు. చెదురుపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చిన్న అంజయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వెల్దండ మండల సింగిల్ విండో మాజీ చైర్మన్ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.గ్రామ సర్పంచ్ దన్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ సాయం అందించారు.ఈ కార్యక్రమంలో పోలే అశోక్, కటికే…