Daily Archive: November 23, 2026

ప్రకాష్ గౌడ్ కుమారుడి పెళ్లి వేడుక నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి.

రాజేంద్రనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ కుమారుని వ్యూహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ఆధార్ కార్డులో పేరు తప్పు.. సరిచేయాలని ఉద్యోగి విజ్ఞప్తి.!

ఆమనగల్లు,నవంబర్ 23: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన మాడుగుల పాలాక్షి ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైంది. ఆమనగల్లు పశువైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన ఆధార్‌లో ‘మాడుగుల పాలక్షి’కి బదులుగా ‘మాడుగుల పాలాక్షి’గా పేరు సరిచేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. పేరు తప్పుగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాసేవకు ప్రతిరూపం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు

మాజీ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ హోదాలో సేవలందించి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పొందిన డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవ, విద్యా రంగంలో తనదైన ముద్ర వేసి, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ సందర్భంగా జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి కే….

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కొరకై వికలాంగుల పోరాటం

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల సాధనకై కోస్గి టు కొడంగల్ పాదయాత్రకు బయలుదేరిన BVHPS నాయకులకు అర్ధరాత్రి పోలీసులు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్‌తో పాటు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, జిల్లా కార్యదర్శి తోకని వెంకటేష్‌లను ముందస్తుగా అరెస్టు చేసిన పరిగి పోలీసులు.. పోలీసుల అరెస్టులు, నిర్బంధాలకు భయపడకుండా వికలాంగుల హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం

జనగామ పీజీ కళాశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా జనగామ జిల్లాకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంతో పాటు, జనగామ పీజీ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు.సోమవారం వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ రామచంద్రంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ను ఘనంగా సన్మానించారు.జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు…

రాచకొండ రాములు చిత్రపటానికి రియల్ ఎస్టేట్ యూనియన్ నాయకుల నివాళులు

ఆప్తమిత్రుడు రాచకొండ రాములు దశదినకర్మ సందర్భంగా జనగామ జిల్లా రియల్ ఎస్టేట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మందాటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డి. అబ్దుల్ ఖాదర్, కోశాధికారి బత్తిని నరసింహులు, కనుగురు శివ, గద్దల అమృతరావు తదితరులు పాల్గొని రాములు మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ సర్పంచ్ జగన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

పరిగి మండలం రాఘవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ జగన్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేశ్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోధైర్యాన్ని కల్పించారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, పలువురు నేతలు పాల్గొన్నారు.

పరిగి మున్సిపల్ పరిధిలో చిరుత సంచారంపై సర్వే

పరిగి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు, నస్కల్ వ్యవసాయ పొలాల్లో చిరుత సంచారం నిర్ధారణ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి పరిశీలించారు.చిరుత సంచారాన్ని గుర్తించేందుకు 4 ట్రాప్ కెమెరాలు, 1 సోలార్ కెమెరా ఏర్పాటు చేశామని తెలిపారు,కెమెరాల ద్వారా చిరుత కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని అన్నారు,గ్రామ రైతులు మరియు స్థానిక ప్రజలకు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు,ఒక వేళ రైతులకు ఎలాంటి కదలికలు కనిపించిన వెంటనే అధికారులకు…

ఎనకతల గ్రామ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధుల హామీ స్పీకర్

మోమిన్ పేట్ మండలం ఎనకతల గ్రామంలో శ్రీ శంకర భారతి ఆశ్రమం శ్రీ శనైశ్చర స్వామి ఆలయంలో నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై  ఆలయ  కమిటీ చైర్మన్ గా బొడ్డు శ్రీనివాస్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు .అదేవిధంగా కళ్యాణ మండపం నిర్మాణానికి  స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో గ్రామ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు వచ్చేలా కృషి చేస్తానని ప్రజలకు హామీ…

కట్టంగూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 23 : కట్టంగూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ లోని వివిధ రికార్డులు, పరిసరాలను పరిశీలించి మండలంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు సత్వరమే స్పందించి పరిష్కరించాలని…