డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి!
- వ్యవసాయ వర్సిటీలో 566 అధ్యాపక పోస్టులకు గ్రీన్‌సిగ్నల్! - November 21, 2026
- తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్! - November 21, 2026
- డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి! - November 21, 2026

జ్ఞాన తెలంగాణ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదంలో మృతి చెందిన వారిని సలావుద్దీన్ (35), మునాజిర్ (34)గా పోలీసులు గుర్తించారు. డివైడర్‌ను ఢీకొన్న తీవ్రతకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
