చల్లపల్లిలో ఘనంగా విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్! - November 6, 2026
- కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు - November 6, 2026
- ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకు ర్యాలీ.. పోలీసులకు వినతి - November 6, 2026

వెల్దండ, నవంబర్ 05:వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లి గ్రామంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమాని చిన్నారి సాయి హర్షిత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. చిన్నారులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.క్రికెట్లో చేజ్ మాస్టర్ గా పేరు సంపాదించుకొని దేశ క్రికెట్ జట్టు విజయం కోసం నిరంతరం కృషి చేస్తున్న విరాట్ కోహ్లీ మీద తమకున్న అమితమైన అభిమానాన్ని ఈ వేడుకల ద్వారా చాటుకున్నారు. విరాట్ కోహ్లీ మరింత విజయాలు సాధించాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చిన్నారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేతన్, రింకు, బిన్ను , లిట్టు తదితరులు పాల్గొన్నారు.
