Category: కొమరం భీమ్ ఆసిఫాబాద్
బెజ్జూరు: మండలంలోని ఎల్కపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లహన్ రాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర నాయకులతో పాటు మంచిర్యాల TUV నాయకులు, బెజ్జూరు మండల నాయకులు పాల్గొన్నారు. కళాజాత నాట్య బృందం ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఉద్యమకారులు ఉత్సాహంగా పాల్గొని ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాయకులు ఉద్యమకారుల సమస్యలు, భవిష్యత్…
సిర్పూర్(టి): మండలంలోని పారిగాం గ్రామం నుంచి ప్రాణహిత నదికి వెళ్లే దారి వర్షాలతో బురదమయంగా మారింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రైతుల పొలాలు ఉండటంతో వ్యవసాయ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో బురద కారణంగా వాహనాలు, ఎడ్లబండ్లు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఫామ్ రోడ్డు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
సిర్పూర్(టి): మండలంలోని కర్జపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 280 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వారి వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరిస్తున్నారు. అర్హత, ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన కోసం అవసరమైన పత్రాలను అందజేయాలని బీఎల్ఏ చంద్రకళ సూచించారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి SIR ప్రక్రియకు సహకరించాలని కోరారు.
బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై విజయ్ను వాలీబాల్ క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధితో పాటు క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీమ్: వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గణనాథునికి తొలి పూజలు చేసి, జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు ఎన్. వామనమూర్తి, అంజన్న, ఆర్ఎస్ఐ…
సిర్పూర్(టి): మండలం తొంకిని గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండా రైతులు తమ చేనులకు వెళ్తుండగా, నదికి స్నానానికి వచ్చే భక్తులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు సైతం రోడ్డుపై నిల్వ ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. రోడ్డు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, భక్తులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో గత కొన్ని నెలల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉండే చేతి పంపుల దగ్గర గంటల తరబడి వరుసలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీ, నాలి...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా,...
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ జిల్లా: సిర్పూర్ టీ మండలంలోని పారిగాం గ్రామాంలోని బిఆర్ఎస్, పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చౌదరి నానాజీ, రేషన్ డీలర్ చౌదరి కుషాబ్ రావ్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ కొండగుర్లే కొండయ్య, ఆధ్వర్యం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...
జ్ఞానతెలంగాణ,కాగజ్‌నగర్ : విజయదశమి సందర్భంగా కాగజ్‌నగర్‌లోని త్రిశూల్ పహాడ్‌పై ఉన్న అమ్మవారి ఆలయాన్ని BRS జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దర్శించారు.డాక్టర్ ప్రవీణ్ కుమార్ పూజలు చేసి, సిర్పూర్-కాగజ్‌నగర్ ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థించారు. “అమ్మవారి కృపతో ప్రజలు విజయం సాధించాలని” కోరుకున్నారు. BRS...