ఎఫ్‌పీఓల్లో చేరితే రైతులకు అధిక లాభాలు
తాడ్వాయి: రైతులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO)ల్లో చేరడం ద్వారా ఆర్థికంగా బలపడటంతో పాటు పంటలకు మెరుగైన ధరలు పొందవచ్చని అధికారులు సూచించారు. తాడ్వాయి సొసైటీ చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఎండ్రియాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు ఎఫ్‌పీఓల ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఫ్‌పీఓ డొమైన్ ఎక్స్‌పర్ట్ మల్యాల శివాని మాట్లాడుతూ, రైతులు సంఘాలుగా ఏర్పడి పంటలను సమిష్టిగా మార్కెటింగ్ చేయడం ద్వారా…
