Daily Archive: November 9, 2026
*బోడుప్పల్లో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్*మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, బోడుప్పల్ డివిజన్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సదర్ సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం…
ఆమనగల్, నవంబర్ 09: ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో కోడిగని లింగం–చంద్రయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంట్లో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చి ఇబ్లబందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి, వార్డు సభ్యులు చిన్న…
వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, రుణాలు మంజూరు చేయాలి ప్రతి వార్డులో వెండింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు గాజులరామారం: గాజులరామారం సర్కిల్ కార్యాలయంలో సోమవారం టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట రాములు మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో కొత్తగా వీధి వ్యాపారులను గుర్తించి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే అర్హత కలిగిన వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక…
తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీ, 22 జిల్లాల అధ్యక్షుల ప్రకటనహైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీతో పాటు 22 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లంబా ఆమోదంతో ఈ నూతన కమిటీని ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం,…
*రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు**పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల పాటు శిక్ష నిలిపివేత* హైకోర్టు ఆదేశాలను అమలు చేయని వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.వివరాల్లోకి వెళ్తే.. నిషేధిత…
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి.. ఇంట్లో చోరీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని శిల్పా వ్యాలీ సారా ప్రైడ్ అపార్ట్మెంట్లో ఈ నెల 2న రాత్రి టెర్రస్ నుంచి తాడు సహాయంతో బాల్కనీలోకి ప్రవేశించి 35 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించాడు. కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ 8న గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద నిందితుడు…
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలోకి ఇద్దరు యువ నాయకులు చేరారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు రఘు ముదిరాజ్, ఎల్లారెడ్డి మండలానికి చెందిన సంతోష్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లో నియోజకవర్గ ఇన్చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు….
హైదరాబాద్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన రైతు పూర్ర నారాయణ కుమార్తె పూర్ర స్వప్న తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆసుపత్రికి చేరుకుని ఐసీయూలో ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి చికిత్స బిల్లును తగ్గించేలా చొరవ తీసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం…
కీసర పోలీస్ స్టేషన్లో మరో అవినీతి కలకలం.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ అరెస్ట్!ఒకే పోలీస్ స్టేషన్లో వరుసగా లంచం కేసులు.. మారని అవినీతి తీరుకీసర: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ మరోసారి అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. పోలీస్ శాఖలో మరోసారి లంచం వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళ్తే…..
ప్రతినిధి,నవంబర్ 9 :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే అరెస్టులతో అడ్డుకుంటారా అని చారకొండ మండల వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి సిరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్య వికలాంగులకు ప్రభుత్వం ఇస్తున్న రూ.4000 పెన్షన్ ను రూ.6000 కు పెంచుతామని ఇచ్చిన మాట తప్పిన నేపథ్యంలో, కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సోమవారం…