రిపోర్టర్, నల్గొండ | 7702665844
Latest posts by Gandamalla Kishan
(see all)
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 5 : మండలంలోని పరడ గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను గురువారం తహసీల్దార్ పుష్పలత పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని సూచించారు. సర్వే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. రైతులకు తమ భూములకు సంబంధించిన వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు. భూముల సర్వే సమయంలో రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. రీసర్వే పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీపీఓ జనార్ధన్ సర్వేయర్ అశోక్, వీఆర్ఏ షేక్ లతీఫ్ రైతులు పాల్గొన్నారు.