రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
కామారెడ్డి, నవంబర్ 24 (జ్ఞాన తెలంగాణ): కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె. వెంకట్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, డీపీసీ (టీబీ), ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్తో పాటు పల్లె దవాఖానాల్లో MLHP/CHO/MO, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరం, రూమ్ నంబర్ 105లో దరఖాస్తులు సమర్పించాలని డీఎంహెచ్వో డాక్టర్ జె. వెంకట్ కోరారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.