Author: Dubbaka Srinivas

ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు శుభవార్త..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు శుభవార్త.. చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ.22.84 కోట్లతో 8 విద్యుత్ సబ్‌స్టేషన్లకు మంజూరు.*ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేసిన నిరంతర కృషి ఫలించింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రూ.22.84 కోట్ల అంచనా వ్యయంతో 8 నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు మంజూరు…

అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సంబరాలు గుర్తుండిపోయేలా గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ మునుపెన్నడూ లేని విధంగా కుంటకట్టపై లైటింగ్ వేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆడపడుచులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ పండుగను జరుపుకునేలా కొత్తదనాన్ని గుర్తుండి పోయేలా చిత్రీకరించారు.

హాస్పిటల్ లో పండ్లు పంపిణీ* 09.10.26 ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో

మన్య శ్రీ కాన్సిరాం గారి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే పండు పంపిణీ చేసిన బీఎస్పీ నాయకులు వారు మాట్లాడుతూభారతదేశంలో వేల సంవత్సరాలుగా కోట్లాది మంది బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు) కులం పేరుతో అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారు. అటువంటి అణగారిన వర్గాలు తమ ఓటు శక్తితో రాజ్యాధికారమనే మాస్టర్‌ కీని సాధించి దోపిడీకి గురయ్యే వర్గం నుంచి పాలించే వర్గంగా ఎదగాలనే మహోన్నత లక్ష్యంతో తన పెళ్లి,ఇల్లు,ఆస్తిపాస్తులు వదిలేసి బహుజన సమాజమే నా కుటుంబం అని జీవితాన్ని ధారపోసిన మహోన్నత నాయకుడు మాన్యవర్…

సంప్రదాయాల బాటలో.. బతుకమ్మ ఆట

వెంకటాపూర్ అగ్రహారం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉపాధ్యాయురాలు పావని ఆధ్వర్యంలో విద్యార్థుల సందడిచట్టం/ ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు పావని ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పావని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. గ్రామంలోని మహిళామణులు సైతం వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాలలో పండుగ…

SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం గురువారం రోజు జనగామ మర్రి మాందాపూర్ చౌరస్తా వద్ద మాందాపూర్ మరియు జనగామ వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకొని SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనగామ సర్పంచ్ మట్ట శ శ్రీనివాస్ మరియు మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి మాందాపూర్ సర్పంచ్ హరీష్ యాదవ్ సీతారాం పల్లి సర్పంచ్ సిద్ధ రాములు ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు జీవన్ రెడ్డి…

బతుకమ్మ దసరా సందర్భంగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటుచేసిన పాలకవర్గం…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ముంద సతీష్ మూడో వార్డు సభ్యులు బతుకమ్మ మరియు దసరా పండగల సందర్భంగా గ్రామంలో మూడో వార్డులో ఆడపడుచులకు వాడు సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలవకూడదని గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్, ఉప సర్పంచ్ చింతకుంట సంతోష్ రెడ్డి సహకారంతో స్ట్రీట్ లైట్లు పెట్టిస్తున్నానని మూడవ వార్డు సభ్యులు బంద్ సతీష్ తెలియజేశారు.

బీబీపేట్ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన PACS చైర్మన్‌గా సుతారి రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు….

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కలిసిన అంబేద్కర్ సంఘ సభ్యులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహం అక్కడినుండి తీపించి మున్సిపల్ ఆఫీస్ లో భద్రంగా ఉంచగలరని, రోడ్డు పనులు పూర్తయిన తర్వాత రోడ్డు మధ్యలో మిడిల్ పాయింట్ చూసి దానిని పెట్టగలరని, ఇట్టి విషయమై గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సార్ గారు మధ్యలోనే పెట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో…

6 హోటళ్లకు షాక్.. లైసెన్సులు సస్పెండ్…

కామారెడ్డి జిల్లా, భిక్‌నూర్ మండలం NH-44పై TGSAFE 10 బృందాలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాయి. వంటగదుల్లో బూజు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు, గడువు దాటిన ఫుడ్, సరిగా నిల్వ చేయని చికెన్, మటన్, ఫిష్‌లను గుర్తించారు. జైకా మల్టీ క్యుజిన్(బస్వాపూర్), మాల్గుడి, వసుధ(భిక్‌నూర్), న్యూ ఉడిపి కృష్ణ భవన్, లుఫియన్స్ ఫ్యామిలీ(అడ్లూర్), తాజ్ ఫ్యామిలీ ధాబా(సదాశివనగర్) హోటళ్ల లైసెన్సులు సస్పెండ్ చేశారు. ఈ హోటళ్లన్నింటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

బీబీపేట్ సొసైటీ చైర్మన్ సుతారి రమేష్…

కామారెడ్డి జిల్లా బివి పేట మండలంలో గత ప్రభుత్వాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దీటుగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ బీబీపేట మండల అధ్యక్షునిగా పనిచేసే ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో మహ్మద్ షబ్బీర్ అలీ దృష్టిలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు బీబీపేట మండలంలో పీఏసీస్ చైర్మన్ గా ఆర్డర్ కాపీ అందుకుంటున్న బీబీపేట్ సొసైటీ చైర్మన్ సుతారి రమేష్ కు పలు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే జంగంపల్లి…