Category: నల్గొండ

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.ప్రజల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 8: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నకిరేకల్‌లో బీఆర్‌ అంబేద్కర్…

వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదునిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్‌ఐ మునుగోటి రవీందర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 8 : వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కట్టంగూర్ ఎస్‌ఐ మునుగోటి రవీందర్ సూచించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక మండపాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్పీకర్లను నిబంధనలకు అనుగుణంగా తక్కువ శబ్దంతో రాత్రి…

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మి

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 7 : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్ల మండల యూనియన్ అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి అన్నారు. సమస్యలు పరిష్కరించాలని సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జమునకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశలకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి పని భారం తగ్గించి పెండింగ్ పారితోషికాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న హైదరాబాద్…

420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు

420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములుప్రజావాణిలో తహసీల్దార్‌కు బీఆర్ఎస్ నాయకుల వినతి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో…

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి : మండల వ్యవసాయ అధికారి వై.గిరిప్రసాద్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి వై.గిరి ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని ఈదులూరు గ్రామంలో పత్తి పంటలను పరిశీలించి డిజిటల్ క్రాప్ సర్వేపై రైతులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పత్తి పంటలో బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకనేందుకు లీటర్ నీటికి 2 శాతం యూరియా ద్రావణం లేదా 19.19.19, 13.0.45…

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్సజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వానరానికి ఓ గోపాలమిత్రుడు మానవత్వంతో అండగా నిలిచారు. కట్టంగూర్ మండలం‌ అయిటిపాముల గ్రామ పరిధిలోని చెర్వుఅన్నారం అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం డీసీఎం వాహనం ఢీకొనడంతో ఓ వానరం తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో రోడ్డుపక్కన పడి ఉన్న వానరాన్ని చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అటుగా…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు..20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువుశిథిలమైన కురుమర్తి రోడ్డు…జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 06: కట్టంగూర్ నుంచి కురుమర్తి కి వెళ్లే రోడ్డు ద్వంసం కావడంతో వాహనదారులు ఇక్కట్లు వడుతున్నారు. 8 కిలో మీటర్ల మేర అడుగడుగునా గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో ఈరోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. రాత్రిపూట అయితే నరకం చూడాల్సిందే అని భయాందోళన చెందుతున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కింద కట్టంగూర్ నుంచి కురుమర్తికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు ద్వంసం కావడంతో ఓ సారి తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేపట్టి చేతులుదుపుకున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో మండలంలోని గార్లబాయిగూడెం, తేలువారిగూడెం గ్రామాలతో పాటు శాలిగౌరారం మండలం ఆకారం, వల్లాల, గురజాల గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం కురమర్తి గ్రామం మీదుగా కట్టంగూర్ కూ రాకపోకలు సాగించాలంటే జంకుతున్నారు. పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో రెండువాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. సత్యనారాయణపురం, కురుమర్తి శివారులో రోడ్డు మద్యలో గోతులు పడడంతో అందులో పడి ఎంతో మంది ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.  పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలి : బీరెల్లి రామచంద్రయ్య మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులునిత్యం రద్దీగా ఉంటే కట్టంగూర్ నుంచి కురుమర్తికి వెళ్లే రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించి రోడ్డు వర్షాలకు ద్వంసం అయి రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత ఐదు సంవత్సరాల నుంది వాహనదారులు రోడ్డు పై ప్రయాణించాలంటే భయాంతోళన చెందుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి కట్టంగూర్, శాలిగౌరారం మండల ప్రజల నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలి

పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్

పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 5 :కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆర్ధిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీ ఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్, డీఎంహెచ్ రాహుల్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,…

హైవే పక్కన వాహనాల నిలిపివేత మృత్యుశకటాలుగా మారుతున్న రహదారులు అక్రమ పార్కింగ్‌తో ప్రాణాలకు ముప్పు

రోడ్డు పక్కన ఆపిన వాహనమే ప్రాణం తీస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి…కట్టంగూర్: హైదరాబాద్‌–విజయవాడ 65వ జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్‌ వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కట్టంగూర్‌ మండల పరిధిలోని అయిటిపాముల నుంచి పామనుగుండ్ల వరకు హైవే పక్కన భారీ లారీలు, కంటైనర్లు, ఇతర వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా దాబాలు, హోటళ్ల వద్ద రోడ్డుపైనే వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది.

మెరుగైన బోధనకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదం : పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన బోధన అందించడంలో కాంప్లెక్స్ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇంగ్లీష్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. వివిధ పాఠశాలల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచవచ్చన్నారు.