ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతం.. రైతు మృతి

ఏటూరు నాగారరం: వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై ఎస్‌కే బషీర్ (33) అనే రైతు మృతి చెందాడు. ఏటూరునాగారం విద్యుత్ శాఖ సెక్షన్ పరిధిలోని చిన్నబోయినపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటారు పనిచేయకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్‌ను ఆపరేట్ చేస్తూ ఫ్యూజ్ సమస్యను సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. హెచ్‌జీ ఫ్యూజ్‌కు సంబంధించిన ఆర్-ఫేజ్ వైర్ తెగి ఎర్తింగ్ ద్వారా ఏబీ స్విచ్ హ్యాండిల్‌కు విద్యుత్ ప్రవహించినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా, లైన్ క్లియర్ తీసుకోకుండా మరమ్మతులు చేపట్టడం ప్రమాదానికి దారితీసినట్లు అధికారులు వెల్లడించారు.

You may also like...