Daily Archive: November 20, 2026
జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట డివిజన్లోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని సంక్షేమ సంఘం సలహాదారు నరసింహారెడ్డి ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా, వాటర్ ట్యాంక్ పక్కన రాత్రికి రాత్రే డబ్బాలు ఏర్పాటు చేసి, వెనుక పిల్లర్లతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. గతంలో 24 ఎకరాల 78 సెంట్లలో 104 బ్లాకులకు ప్రణాళిక రూపొందించగా, 54 బ్లాకులు నిర్మించి 1,779 నిరుపేద కుటుంబాలకు ఇళ్లు పంపిణీ చేశారని వివరించారు. మిగిలిన స్థలాలను ఆటస్థలాలు, ఆలయం,…
తలకొండపల్లి,నవంబర్ 20: మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పడకల్ గేట్ వద్ద మహీధర రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆహార శుద్ధి కర్మాగార భవన సముదాయానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారితో కలిసి పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. రైతుల ఉత్పత్తులకు విలువ జోడించి, ఆహార…
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISA రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ AISA నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాష్ట్ర మహాసభల ప్రాధాన్యతను వివరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా సమస్యలు, అధిక ఫీజుల భారం, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల్లో విద్యార్థుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, వాటి పరిష్కారం…
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ నరేష్, ఉపసర్పంచ్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, మండల కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలోని కోటికిపైగా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హ…
కల్వకుర్తి నవంబర్ 20: మండలంలోని జూపల్లి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ జగపతి, సీనియర్ నాయకుడు బొజ్జయ్య, రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీనునాయక్, భాస్కర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.వివాహ, నామకరణ వేడుకల్లో పాపిశెట్టి రాము కల్వకుర్తి నియోజకవర్గంలోని…
కామారెడ్డి జిల్లా బహుజన జన సంఘం మహిళా అధ్యక్షురాలు సట్టిగారి బుజ్జమ్మ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మంగమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర శివరాజ్, మాదిగ రాజకీయ పోరాట సమితి (MRPS) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. బాగయ్య తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్: ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై మల్కాజిగిరి ఎస్ఓటీ జోన్-1 బృందం కొరడా ఝళిపించింది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెండు యూనిట్లపై దాడులు నిర్వహించింది. శ్రీ కర్ణి మాత నమ్కీన్ ఫుడ్ చిప్స్ యూనిట్లో అపరిశుభ్ర వాతావరణంలో, తయారీ, గడువు తేదీల వివరాలు లేకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. వసంత్నాథ్ ఎంటర్‌ప్రైజెస్‌లో అనుమతులు లేకుండా కోళ్ల, చేపల మేత తయారీతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాల వ్యవహారాలు వెలుగులోకి…
ఘట్కేసర్: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఘట్కేసర్ పోలీసులు పిలుపునిచ్చారు. ఘట్కేసర్లోని రిషి పాఠశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలను స్వీకరించవద్దని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాటి నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత…
జ్ఞాన తెలంగాణ, వెల్దండ:నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వెల్దండ మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ లబ్ధిదారులకు బీమా పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి…
సైబరాబాద్: సైబర్ నేరాలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి నవంబర్ 11 నుంచి 18 వరకు 10 కేసులను ఛేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది నిందితులను అరెస్టు చేశారు. వీటిలో సైబర్ మోసాలు 2, పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలు 2, ట్రేడింగ్ మోసాలు 3, స్మిషింగ్ మోసాలు 2, డిజిటల్ అరెస్ట్ కేసు ఒకటి ఉన్నాయి. బాధితులకు 38 కేసుల్లో రూ.78,62,961 తిరిగి చెల్లించేందుకు 59 రీఫండ్ ఆర్డర్లు పొందారు….