Daily Archive: November 14, 2026
BVHPS రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ వెల్లడించారు ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రత్యేక సంక్షేమ శాఖ పథకాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, స్వయం ఉపాధి రుణాలు వెంటనే మంజూరు చేయాలి. లేనిపక్షంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని BVHPS రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదేశాల మేరకు వికారాబాద్…
మతాలు వేరైనా మనసులు మంచివైనప్పుడే సమాజంలో ఐక్యత, సోదరభావం వెల్లివిరుస్తాయని సంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని అన్నారు. ప్రజలు భక్తి మార్గంలో నడుస్తూ దైవాన్ని ఆరాధించినప్పుడే మనశ్శాంతి లభిస్తుందని పేర్కొన్నారు.శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మనియార్పల్లి గ్రామం మీదుగా క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే ధరూర్ 104వ జాతరను పురస్కరించుకొని పాదయాత్రగా బయలుదేరిన క్రైస్తవ సోదర సోదరీమణులకు మొహమ్మద్ ముల్తాని సేవలందించారు. ఈ సందర్భంగా పాదయాత్రికులకు చల్లటి పానీయాలు, అన్నం పొట్లాలను పంపిణీ చేశారు.ఈ…
వెల్దండ,నవంబర్ 13 :నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి కొత్తచెరువు పక్కనే ఉన్న క్రషర్ మిషన్, పొలం గట్టు గుట్టకు పెడుతున్న బ్లాస్టింగ్ కారణంగా చెరువు కట్టకు మరియు అలుగుకు ప్రమాదం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.బ్లాస్టింగ్ ధాటికి అలుగు ముందర భాగంలో కింద ఉన్న సిమెంట్ కాంక్రీట్ పెచ్చులు లేచిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు.ఇదే విధంగా బ్లాస్టింగ్ కొనసాగితే చెరువు కట్టకు, అలుగుకే ప్రమాదం ఏర్పడి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పచ్చని ప్రకృతితో కలకలలాడే…
దూలపల్లి గ్రామ పరిధిలోని 121, 124, 125 మరియు 126 సర్వే నంబర్ పరిధిలో, 1995 సంవత్సరంలో చేసిన శ్రీ వెంకటేశ్వర కాలనీ వెంచర్ మరియు ఇతర ప్లాట్లను ఫాక్స్ సాగర్ బఫర్ జొనులో ఉందని హైడ్రా ఆపాదిస్తూ అక్కడి నిర్మాణాలను మరియు రోడ్లను తొలగించి ఫాక్స్ సాగర్ సుందరీకరణ పనులు చేపట్టారు. దీనికి నిరసనగా ప్లాట్ల యజమానులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. ఈ…
చింతల్లోని భాగ్యరధి డిగ్రీ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త యువ – నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల ఎస్ఐ గంగాధర్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. సామాజిక కార్యకర్త…
ప్రజా అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 20 ఏళ్లుగా శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రెండోరోజు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వాలు కార్మికులకు వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులను పర్మినెంట్ చేసి, వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన…