Daily Archive: November 17, 2026
కూకట్పల్లి: నియోజకవర్గ పరిధిలో కొత్తగా 4,092 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరయ్యాయి. సర్కిళ్ల వారీగా కూకట్‌పల్లిలో 705, మూసాపేటలో 2,179, ఓల్డ్ బోయిన్‌పల్లిలో 1,208 మందిని ఎంపిక చేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్చార్జి బండి రమేష్ తెలిపారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
జ్ఞానతెలంగాణఝరాసంగం నవంబర్ 17సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రం రైతు వేదిక వద్ద మంగళవారం చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 586 మంది నూతన లబ్ధిదారులకు జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, ఎంపీడీవో మంజుల, తహసీల్దార్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు పాటిల్, కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ చేతుల మీదుగా మంజూరు…
సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సైబరాబాద్ మూవ్స్–2026లో 400కు పైగా విద్యాసంస్థలకు చెందిన సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ డా. జి. సృజన విద్యాసంస్థలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చేపడుతున్నారు. నవంబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ. నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో…
మల్కాజిగిరి: ఎస్ఓటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 3.180 కిలోల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్ 16న ఐడీఏ నాచారంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థం విలువ సుమారు రూ.40 లక్షలు. మూడు సెల్ఫోన్లు, టీవీఎస్ జూపిటర్ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సరఫరాదారు వెంకట్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు…
మల్కాజిగిరి: ఫేస్బుక్లో నకిలీ ముద్రా రుణ ప్రకటనలతో వ్యాపారిని రూ.4,67,800 మోసం చేసిన నలుగురిని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు సేకరించి ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్ తదితర ఛార్జీల పేరుతో నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. నేరానికి ఉపయోగించిన రెండు సెల్ఫోన్లు, రెండు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సీపీ బి.సుమతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జె.ఎల్. కృష్ణంరాజు బృందం చర్యలు చేపట్టింది….
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 17: అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని గానుగట్టు తండా మాజీ సర్పంచ్ పత్యా నాయక్ అన్నారు. వెల్దండ మండలం గానుగట్టు తండాకు చెందిన శంకర్ నాయక్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును సోమవారం ఆయన బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారంలోని శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్ధి పీఠం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకేఎం ట్రస్ట్ చైర్మన్, మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపారాధన భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. నిర్వాహకులను అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, పున్నారెడ్డి, బాలప్ప, అంజిరెడ్డి, సాగర్,…
కుత్బుల్లాపూర్: ధూలపల్లి గంగస్థాన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ కిషోర్ (44) మృతి చెందాడు. బహదూర్‌పల్లిలో తల్లిదండ్రులతో నివసిస్తున్న కిషోర్ కొంపల్లి ఇన్‌స్టామార్ట్‌లో పనిచేస్తున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో ఆర్డర్ డెలివరీకి బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వేగంగా, నిర్లక్ష్యంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కిషోర్ తలకు తీవ్ర గాయమై, ఎడమ కాలు విరిగింది. తొలుత ఎస్వీ ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించగా, ఉదయం 3.15…
మేడ్చల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. అట్టివెల్లిలోని జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో మేడ్చల్ డివిజన్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన 1,140 పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు యాదవ్, సత్యనారాయణ, చాప రాజు, సురేందర్…
కుత్బుల్లాపూర్: డీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుయ్యని శివకుమార్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ వైస్ కౌన్సిలర్ కటకం జయరాం, గిరినగర్ డివిజన్ అధ్యక్షుడు బుదానా కనకరావు, హమ్మిరెడ్డి…