Daily Archive: November 11, 2026

స్వయం ఉపాధితో యువత ఆదర్శంగా ఎదగాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి నవంబర్ 11: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు శాంతినగర్ కాలనీకి చెందిన నల్లబోలు సాయికిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘కేక్ హౌస్ బేకరీ’ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యా నాయక్, ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పసుపుల జంగయ్య, సురేందర్ రెడ్డి, యాట నరసింహ, శివలింగం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా…

చెరకు రైతులకు టన్నుకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలి

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర చెరకు శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు 49,592 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుండగా, ఏటా 12,39,800 మెట్రిక్ టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అయితే గత…

పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో అండ.. రూ.20 వేల ఆర్థిక సాయం.!

వెల్దండ,నవంబర్ 11: పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా కుప్పగండ్ల మాజీ సర్పంచ్ శేఖర్ తనవంతు సహాయం అందించారు.వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ కుమార్తె మేఘన వివాహం సందర్భంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి సహాయం చేయడం సంతోషంగా ఉందని, మేఘన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాలకిష్టయ్య గౌడ్,…

విలువలతో కూడిన విద్యకు చిరునామా అధ్యాపక్ కళాశాల ​హైదరాబాద్:

విలువలతో కూడిన విద్యకు చిరునామా అధ్యాపక్  కళాశాల  ​పటాన్‌చెరు ‘నందిగామ’లో కార్పొరేట్ సదుపాయాలతో ఆదర్శ విద్యాలయం!విలువలతో కూడిన జ్ఞానం… అనుభవజ్ఞులైన అధ్యాపకులతోనే సాధ్యం!” అనే ఉన్నతమైన ఆశయంతో పటాన్‌చెరు సమీపంలోని నందిగామలో ఓ ప్రత్యేకమైన విద్యాలయం అందుబాటులోకి వచ్చింది. బోధనానుభవమే పెట్టుబడిగా, అధ్యాపకులే స్వయంగా యాజమాన్యంగా మారి ఈ విద్యాసంస్థను స్థాపించడం విశేషం. బోధనపై పూర్తి పట్టున్న ఉపాధ్యాయులే స్వయంగా పర్యవేక్షించడంతో ఇక్కడ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నైపుణ్య ఆధారిత విద్య లభిస్తోంది. ​హైదరాబాద్ నగర…