Daily Archive: November 2, 2026
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన రోస్టర్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబడింది.ఈ వెరిఫికేషన్ కార్యక్రమంలో ఉదయ్ (UDAY) అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం. శ్రీనివాసులు గారు మరియు నాగర్‌కర్నూల్ జిల్లా ఉదయ్ బృందం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రోస్టర్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులతో సమన్వయం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ గారు దివ్యాంగుల…
కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి : బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మదుసూధన్ రెడ్డిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 31 : ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా లో కట్టంగూర్ కు చోటు కల్పింకపోవడం బాధాకరమని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూధన్ రెడ్డి అన్నారు. కట్టంగూర్ నం కరువు మండలంగా ప్రకటించాలని శనివారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ…
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 31 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని అన్నారు.శనివారం…
బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలుగా మహేశ్వరి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 31: బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలుగా మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన గోలి మహేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిళ్ళ కాశమ్మ శనివారం నియమకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ మహిళ సమస్యల పరిష్కారంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బాధ్యత అప్పచెప్పిన…
వెల్దండ అక్టోబర్ 31: వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్యురాలు డాక్టర్ సింధు ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యోగా శిక్షకులు బీరయ్య సీపీఆర్ చేసే విధానాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..గుండెపోటు లేదా గుండె ఆగిపోయిన పరిస్థితుల్లో బాధితుడికి వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.అత్యవసర సమయంలో అంబులెన్స్ వచ్చేలోపు సరైన పద్ధతిలో ఛాతీపై ఒత్తిడి ఇవ్వడం ఎంతో కీలకమని వివరించారు.ప్రతి…
వెల్దండ అక్టోబర్ 31 : కడ్తాల్ మండలంలోని రెండు నిరుపేద మృతుల కుటుంబాలకు మాజీ జెడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.న్యామంతపూర్కు చెందిన ఓర్సు సరస్వతి ప్రమాదంలో మృతి చెందగా, రావిచేడు గ్రామానికి చెందిన అండే కార్ రామోజీ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న దశరథ్ నాయక్ బాధిత కుటుంబాలను పరామర్శించి,మృతదేహాలకు నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు…
వెల్దండ అక్టోబర్ 31 : రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయి చికిత్స పొందుతున్న పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన జర్నలిస్టు,డాన్స్ మాస్టర్ ఏదుల శేఖర్‌ను పలువురు నాయకులు శనివారం పరామర్శించారు. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, కౌన్సిలర్ రామరాజుతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ రూ.5 వేలు, ఆనంద్ కుమార్ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం…
వెల్దండ: అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరు నమోదులో భాగస్వామి కావాలని సూచించారు.పోతేపల్లి గ్రామంలో నివసిస్తున్న అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు నమోదైతేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే…
బండ్లగూడ కాలీమందిర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రాజేంద్రనగర్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) టి. ప్రకాష్ గౌడ్ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.