పీఏసీఎస్‌ నామినేటెడ్‌ చైర్మన్ల నియామకాలు చెల్లవు!

పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు)లో నామినేటెడ్‌ చైర్మన్ల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా పీఏసీఎస్‌ ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్ణీత గడువులో ఎన్నికల ప్రక్రియను ప్రకటించి నిర్వహించకపోతే, గతంలో ఎన్నికైన చైర్మన్లు యథావిధిగా కొనసాగుతారని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.

You may also like...