Category: తెలంగాణ

కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.!

కల్వకుర్తి 10: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కరెంటు కోతలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను గాలికి వదిలేసిందని ఆరోపించారు.రోజురోజుకు కరెంటు కోతలు విధిస్తూ రైతులను వేధిస్తున్నారని, కరువుతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…

రాంచంద్రాపురంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 10: వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని గురువారం సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండల కేంద్రములోని సండే మార్కేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు, పూలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆమె పెత్తందారి విధానానికి, దోపిడికి,దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా, దొర దొరసాని సంస్కృతికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరు చేసిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగనిరతిని…

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ దన్సింగ్ నాయక్

వెల్దండ సెప్టెంబర్ : వెల్దండ మండలంలోని చెదురుపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చూస్తామని అన్నారు.స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెరుగు సహదేవ్, వార్డు సభ్యులు శివ యాదవ్, తిరుపతి,…

శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్

శంకర్పల్లి సాయి నగర్ కాలనీలో గణేష్ ఆధ్వర్యంలో గణేష్ ని స్వాగతం పలుకుతూ ఆటపాటలతో సందడి భారీగా మహిళలు యువకులు పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులు శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ శాత ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగ రెడ్డి మాజీ చైర్మన్ భాను వెంకటరామిరెడ్డి...

శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

శంకర్‌పల్లి: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శంకర్‌పల్లి పట్టణంలో ఆమె విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ...

శంకర్ పల్లి 2వ వార్డులో రూ. 70 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన

శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ గాయత్రి నగర్ లో రూ. 70 లక్షల మున్సిపల్ అభివృద్ధి నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్, 2వ వార్డు...

పుస్తక పఠనంతో జ్ఞాన వికాసం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులు, ర్యాకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శరత్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంఈఓ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్‌ (Books Build Brighter Future) ఫౌండర్...

బాల భరోసా – అనాధ పిల్లలకు భరోసా

కల్వకుర్తి 09: రాష్ట్రంలోని అనాథ పిల్లలు, నిరాశ్రయులు మరియు సంరక్షణ అవసరమైన బాలల సమగ్ర రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా కుటుంబ పోషణ కోల్పోయిన బాలలను గుర్తించి వారికి ప్రభుత్వ సంరక్షణ కల్పించడం. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ బారిన పడకుండా వారిని కాపాడటమని పేర్కొన్నారు.*ధ్రువీకరణ పత్రం ప్రాముఖ్యత:*ఈ పత్రం ద్వారా ఒక చిన్నారిని ప్రభుత్వం…

పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో దుస్తులు పంపిణీ :

వెల్దండ మండలంలోని పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ ప్రభుత్వ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని స్వయంగా తన చేతులు మీదుగా దుస్తులు విద్యార్థులకు పంచడం జరిగింది. సర్పంచ్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని తేలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వార్డు సభ్యులు నేతలు గోరేటి అశోక్ కుమార్…

భూములు కోల్పోతున్న రైతులకు రూ.20 లక్షలు ఇవ్వాలి

వెల్దండ సెప్టెంబర్ 10: డిండి – నార్లాపూర్ డి-82 ప్రాజెక్టులో భాగంగా ఇర్విన్ – అజిలాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న బాధితులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.అజిలాపూర్ సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన రైతులు,నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎకరాకు 20 లక్షలు ఇచ్చిన విధంగా తమకు కూడా పరిహారం ఇవ్వాలని కోరారు.భూములే నమ్ముకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు. దీనిపై…