రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థినుల ఎంపిక…
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీల్లో ఆర్.ఆర్. హైస్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన అండర్-14 బాలికల అథ్లెటిక్స్ లాంగ్ జంప్ విభాగంలో పి. నిహారిక రజత పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అదేవిధంగా అండర్-17 బాలికల విభాగంలో టి. మధుప్రసన్న తెలంగాణ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపికైంది. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు క్రీడా విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజయం సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
