Category: ములుగు

ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ అంతరాయం

వాజేడు: చీకుపల్లి సమీపంలో ధర్మవరం 33 కేవీ విద్యుత్ లైన్ రోడ్డు క్రాసింగ్, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో గురువారం (12-11-2026) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.అంతరాయం కలిగే సమయంలో రైతులకు నిలిచిపోయిన మూడు ఫేజ్‌ల విద్యుత్‌ను రాత్రి సమయంలో తిరిగి సరఫరా చేయనున్నట్లు వాజేడు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.

ములుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం

ములుగు: ములుగు జిల్లాలో ఓ దివ్యాంగ మహిళపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం ఇంట్లో ఉన్న రూ.4 వేల నగదును కూడా నిందితుడు అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి గుర్తింపు, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై వెంకటేశ్ వెల్లడించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

రవిచందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ములుగు: పుట్టినరోజు సందర్భంగా దివంగత కాంగ్రెస్ నేత నల్లెల్ల కుమారస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి రవిచందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుడుంబా స్తావారాలపై పోలీసుల దాడులు

వెంకటాపురం: నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూగూరు వెంకటాపురం సీఐ ముత్యం రమేష్ నేతృత్వంలో వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ శివారులోని మూడు ప్రాంతాల్లో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9,600 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేశారు. 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు తిరుపతి రావు, తిరుపతి రెడ్డి, పోలీస్…

ఎమ్మెల్సీ ఓటుకు 6నే ఆఖరి గడువు

జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే పట్టభద్రులకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కీలక సూచన చేసింది. ఓటరు నమోదుకు నవంబర్‌ 6వ తేదీనే చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...

లంచం వసూళ్లకు తెరలేపిన తహసీల్దార్‌.. ఏసీబీకి చిక్కిన సృజన్‌కుమార్‌

జ్ఞాన తెలంగాణ, ములుగు: గోవిందరావుపేట తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. తండ్రి, కొడుకుల మధ్య నెలకొన్న భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ.14 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. లంచం డిమాండ్‌, ఏసీబీ చర్యలకు…

ఆదివాసి ఆరోగ్యానికి జంపన్న అండ.. లక్ష్మీపురంలో ఉచిత వైద్య శిబిరం

జ్ఞానతెలంగాణ,గోవిందరావుపేట, ఆగస్టు 8:గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్న ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది...

స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: భూక్య జంపన్న

స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: భూక్య జంపన్న జ్ఞానతెలంగాణ,ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే...

ఇంటి వద్దకే మేడారం ప్రసాదం… భక్తులకు TGSRTC వినూత్న సేవలు

ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వినూత్న సేవలను ప్రారంభించింది. జాతరకు ప్రత్యక్షంగా వెళ్లలేని భక్తుల కోసం ఇంటి వద్దకే అమ్మవార్ల ప్రసాదం అందించే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా...

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య జ్ఞాన తెలంగాణ,ములుగు : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన ఎస్పీ జైలు రిటైర్డ్ అధికారి గగులోత్ సమ్మయ్య 01-12-2025న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు...