Daily Archive: November 12, 2026
మేడ్చల్–మల్కాజిగిరి, డంప్‌యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు రాష్ట్ర ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. డంప్‌యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం పడుతోందని, ఈ…
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) 2026 నవంబర్ 12న జీఓ ఆర్టీ నంబర్ 1654ను విడుదల చేసింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ కీలక బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ కాగా, ఆయన స్థానంలో మహేష్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్…
కడ్తాల్,నవంబర్ 12 :కడ్తాల్ పట్టణంలో దుర్గామాత మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఆ వేడుకల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఐక్యత సేవా సంస్థ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.1 లక్ష ఇరవై వేలు ఆర్థిక సహాయాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.నిమజ్జనోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన వెలుగు అలంకరణలు, సంగీత ఏర్పాట్లు, వేదిక అలంకరణల కోసం ఈ సహాయం చేస్తానని…
మేడ్చల్, సేవించి వాహనాలు నడిపిన వారిపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యల్లో భాగంగా మరో ఐదుగురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మొత్తం 8 కేసులను గురువారం మేడ్చల్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో విచారించారు.వీటిలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన రెండు కేసులకు సంబంధించి రూ.2,000…
కుత్బుల్లాపూర్, ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని పరిరక్షించి, విద్యార్థుల క్రీడా అవసరాలకు అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు, ప్రగతి నగర్, బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు కోరారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు.ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల ఆట స్థలం పరిరక్షణ అంశాన్ని ఇప్పటికే…
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా గంగుల అంజలి యాదవ్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అలకా లాంబా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కమలాక్షి నటరాజన్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా గంగుల అంజలి యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా అవకాశం…
ఆమనగల్,నవంబర్ 12 :గ్రామాల ప్రథమ పౌరులైన సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని ఆమనగల్ మండల సర్పంచుల సంఘం కార్యదర్శి, పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య ప్రభుత్వానికి విన్నవించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ ప్రజలు నేరుగా ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్. విద్యార్హతతో సంబంధం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన మాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు ఎందుకు ఉండదు అని ప్రశ్నించారు.ఎంపీటీసీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఓటు వేసే…
జ్ఞాన తెలంగాణ,ప్రత్యేక కథనం: హైదరాబాద్ మహానగర పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు మూడు దశాబ్దాల పోలీస్ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేసి పరిపాలనా అనుభవాన్ని, క్షేత్రస్థాయి పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలు...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహణకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్, IAS, మీకాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించి సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఆయన సమీక్షించారు. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీతో పాటు సమ్మిట్ వేదిక వద్ద…
లింగారెడ్డి పల్లి : గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను స్వయంగా పరిశీలించేందుకు సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.గురువారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్న సర్పంచ్ గారు, ముందుగా వంటశాలను పరిశీలించి, వంటకు ఉపయోగించే బియ్యం, కూరగాయలు, నూనె తదితర సరుకుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని వారితో పాటే భోజనం చేసి, భోజనం రుచి, నాణ్యత గురించి విద్యార్థులను…