రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎల్లారెడ్డి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24,600 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదానికి బానిసై కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.