అంబరాన్నింటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బతుకమ్మ సంబరాలు

కల్వకుర్తి అక్టోబర్ 17: కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటలు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ పోటీలు నిర్వహించి, తల్లులతో కలిసి బతుకమ్మ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ బొల్లె పర్వతాలు, మండల కో-ఆర్డినేటర్ సృజన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు పాల్గొన్నారు.

సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమం

సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమంసంకేపల్లి:సంకేపల్లి గ్రామంలో తొలిసారిగా శ్రీ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి, భక్తులు దుర్గామాలలు ధరించి నిత్యం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిష్టాపన జరిగి నేటికి 7 రోజులు పూర్తయిన సందర్భంగా, శ్రీ రామాలయ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో మొదటిసారిగా…

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 18 : దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు. మండలంలోని పరడ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై…

భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ

భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను మండలవ్యాప్తంగా మహిళలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, ఆయా గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మండలంలోని కల్మెర గ్రామంలో ఉత్తమ బతుకమ్మలను పేర్చిన మహిళలకు…

మధు గౌడ్ యాష్కీకి ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట, డీసీసీ అధ్యక్షుడు ఏలే!

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన మధు గౌడ్ యాష్కీకి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధు గౌడ్ యాష్కీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.AIPC చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మధు గౌడ్ యాష్కీ నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతం కావాలని, వృత్తి నిపుణులను కాంగ్రెస్ పార్టీకి మరింత…

సోమవారం ప్రజావాణి రద్దు

జనగామ: దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు (OH) ఉన్నందున ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు. తమ వినతులు, ఫిర్యాదుల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆయన కోరారు.

సద్దుల బతుకమ్మ వేళ విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి చిత్తలూరి మధు (అంజయ్య కుమారుడు) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మృతదేహాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను…

క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం..సుంకిరెడ్డి

తలకొండ పల్లి :తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు.టోర్నమెంట్ నిర్వహణకు రూ.10 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.అనంతరం తండా ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు…

రుతుక్రమ ఆరోగ్యంపై సుప్రీం ఆగ్రహం!

న్యూఢిల్లీ: రుతుక్రమ ఆరోగ్యం, బహిష్టు పరిశుభ్రతను ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు అమలుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ తీర్పు అమలుకు తీసుకున్న చర్యలపై వివరాలు సమర్పించకపోవడాన్ని ప్రశ్నించింది. తదుపరి...