Author: PAKADI RAMANJANEYULU
ఆమనగల్లు అక్టోబర్ 13 :యువత ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం,దేశం అభివృద్ధి చెందుతాయని టాస్క్ సీఓఓ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆమనగల్ పట్టణ కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్‌కు ఆయన హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కంపెనీల ప్రతినిధులను నేరుగా యువత వద్దకు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దూర…
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాకు డిమాండ్.. ఢిల్లీలో ధర్నాకల్వకుర్తి:ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
వెల్దండ:మండల కేంద్రంలోని బుధవార్‌పేట ఆంజనేయస్వామి దేవాలయం,పాండురంగ నాయకస్వామి ఆలయాల్లో సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అల్లంపల్లి కృష్ణ, కార్యదర్శి పాలాది సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సవ…
రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటనకల్వకుర్తి అక్టోబర్ 12 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం (అక్టోబర్ 13) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటలకు కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని కేబీఎన్ ఫంక్షన్ హాల్లో మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు.ఈ కార్యక్రమాలకు కల్వకుర్తి మండల సర్పంచులు, ఉపసర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని…
వెల్దండ అక్టోబర్ 12:నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ప్యూరిఫైయర్ వాటర్ మిషన్ అందజేశారు.ఆయన తండ్రి చౌదర్ పల్లి సర్పంచ్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఎంపీడీవో సులోచన, పర్యవేక్షకులు మోహన్ లాల్ ఆధ్వర్యంలో ఈ వాటర్ మిషన్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, కొండల్ యాదవ్, నాయకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్: అచ్చంపేట ఉప విభాగ ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందాడ వెంకటయ్య రూ.25 వేల లంచం వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడ్డారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఫిర్యాదుదారుడికి సెలవులు, రావాల్సిన బత్యాలకు సంబంధించిన బిల్లులు పూర్తి చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ వెంకటయ్య రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా ఆగస్టు…
వెల్దండ: మండలంలోని డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఎమ్మెల్సీ ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ కార్తీక్ కుమార్ కోరారు. వెల్దండ మండలంలోని 32 గ్రామపంచాయతీల పరిధిలో ఇప్పటికే 780 మంది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదై ఉన్నారని తెలిపారు.2023 అక్టోబర్ నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అర్హులైన యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలను అప్లోడ్ చేసి ఆన్లైన్లో లేదా మాన్యువల్‌గా దరఖాస్తు…
కల్వకుర్తి :హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులైన శ్రీ నక్క బోజ్జయ్య (గణేష్)ను కొమ్మగోని శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఆయన కార్యాలయ ఛాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరించడంతో పాటు జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా నక్క బోజ్జయ్యకు లభించిన న్యాయ నియామకం, వృత్తిపరమైన పురోగతిని అభినందించారు. ప్రభుత్వ ప్లీడర్‌గా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల తరఫున సివిల్ వివాదాలు, దావాలు, ఇతర న్యాయపరమైన…
వెల్దండ:వెల్దండ మండల కేంద్రానికి చెందిన జంగిలి జాషువా మరణించిన విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బుధవారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. జాషువా మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యల పుల్లయ్య, కృపానందం,గుద్దటి కిష్టల్, పసునోజు పురుషోత్తం, మసిగుండ్ల వెంకటేష్,మారేపల్లి శ్రీనివాస్, మట్ట భరత్,రేవల్లి బాలరాజు,ఈదులపల్లి…
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతతశ్రీ పాండురంగ నాయక దేవాలయంలో శరన్నవరాత్రి పూజలువెల్దండ:మండల కేంద్రంలోని శ్రీ పాండురంగ నాయక దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా డీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ యన్నం భూపతిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనిషిలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయని అన్నారు. దుర్గామాత అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారిని…