పేద బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో ముస్తాపూర్ గ్రామంలో రెండు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ, అర్హులైన పేద బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించడం లేదని ఆరోపిస్తూ గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, పేద బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మమత వివేకానంద, నస్కంటి చిన్నకాంతం, మాజీ ఉపసర్పంచ్ నస్కంటి కాశీరాం, మూడో వార్డు సభ్యురాలు సంధ్యా రవి, యూత్ అధ్యక్షుడు ఎర్ల సాయిలు, నీరడి సంతోష్, బోరంచ రాములు, ఎం.కె. శ్రీకాంత్, కేతావత్ లక్ష్మణ్, జూకంటి సంజీవులు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
