Category: జిల్లా వార్తలు

కార్మికులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న దళారుల అవినీతి ఆరోపణల విచారణ చెయ్యాలి అని కార్మికులు డిమాండ్ చేశారు…

కార్మికులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న దళారుల అవినీతి ఆరోపణల విచారణ చెయ్యాలి అని కార్మికులు డిమాండ్ చేశారు… కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు పారం అందజేసిన వ్యవస్థాపక అధ్యక్షులు మర్లు సాయిబాబు ఎల్లారెడ్డి మున్సిపల్ లోని ఆరో వార్డు లోని. భవనం నిర్మిస్తున్న స్థలం నిర్మాణంలో ఉండే నిజమైన పనిచేసే. భవన నిర్మాణ కార్మికులందరూ. తప్పనిసరిగా. లేబర్ కార్డు కలిగి ఉండాలని. తెలియజేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ…

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుకై సమీకరణలు…

కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న షబ్బీర్ అలీ నివాసంలో దాదాపు 15 మైనారిటీ విద్యాసంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సమా రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాఫర్ జావేద్, పలు ప్రముఖ కళాశాలల ప్రతినిధులు హాజరయ్యారు. జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడం,…

పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి: పగడాల సైదులు మహారాజ్

వెల్దండ నవంబర్ 05: వెల్దండ మండలంలోని పట్టభద్రులంతా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మాదిగ జాగృతి మండల సంఘం అధ్యక్షులు పగడాల సైదులు మహారాజ్ అన్నారు.గురువారం ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు పత్రాన్ని వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్ కు అందజేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి పట్టభద్రుడు తప్పకుండా దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గడువు ముగిసేలోపు ఎవరూ మిగిలిపోకుండా అందరూ నమోదు చేసుకోవాలని కోరారు.

ప్రజాసేవకే అంకితమవుతా: సింగిల్ విండో డైరెక్టర్ గంగదారి మల్లేష్

వెల్దండ నవంబర్ 05:సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికైనందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి,రాచూర్ గ్రామ ప్రజలకు వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన గంగదారి మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.గురువారం ఆయన మాట్లాడుతూ..రాచూర్ గ్రామ ప్రజల ఆదరణ, ఆశీర్వాదం, భగవంతుని కృపతోనే తనకు వరుసగా అవకాశాలు లభించాయని అన్నారు. తన నాన్నగారు అయిన గంగధారి శంకరయ్యను విద్యా కమిటీ చైర్మన్ గా, తనను గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా, తన భార్య గంగధారి శిరీషను గ్రామ పంచాయతీ…

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక మారుమూల గ్రామం నుంచి ప్రతిభ చాటిన గోపాలకృష్ణ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 5: జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో మండలంలోని దుగినవెల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటాడు. తిరుమలగిరి సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌-14 వాలీబాల్ పోటీల్లో దుగినవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఏనుగుల గోపాలకృష్ణ ప్రతిభ కనబరిచి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం…

ఎర్రపహాడ్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ శివారులోని దేమే గేట్ సమీప అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని తాడ్వాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.31,840 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్ఐ నరేశ్ తెలిపారు.

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు.. పీఏసీఎస్ చైర్మన్లకు నియామక ఉత్తర్వులు

వెల్దండ,నవంబర్ 05 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులు, వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నూతనంగా నియమితులైన చైర్మన్లు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. కల్వకుర్తి మండలానికి చెందిన రఘుపతిపేట హరీష్‌రెడ్డి,…

ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూరు, నవంబర్ 5: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం శాలిగౌరారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నాయనమ్మ మృతి చెందడంతో ఆమెకు నివాళులర్పించి, ఎంపీని…

ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 5 : ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ న్స్ను గురువారం తాసీల్దార్ పుష్పలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియపై ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ సంప్రదించి వివరాలు…

ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు : ఏఓ గిరిప్రసాద్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 5: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వల్ల రైతులు యాసంగి సీజన్‌లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కట్టంగూర్ వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ సూచించారు. ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో ఎల్‌నినో పరిస్థితులు, భూసంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులను పొదుపుగా…