సింగిల్ విండో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలి..రైతులకు ఓటు హక్కు కల్పించాలి: సిద్ధగొని రమేష్ గౌడ్
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్! - November 6, 2026
- కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు - November 6, 2026
- ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకు ర్యాలీ.. పోలీసులకు వినతి - November 6, 2026

వెల్దండ: తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సింగిల్ విండో) చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులను నామినేటెడ్ విధానంలో కాకుండా, ఎన్నికల ద్వారా భర్తీ చేయాలని అజిలాపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ వెల్దండ మండల వైస్ ప్రెసిడెంట్ సిద్ధగొని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.సహకార సంఘాల పాలకవర్గాలను రైతులే తమ ఓటు హక్కుతో ఎన్నుకునే అవకాశం కల్పించాలని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు. రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
