Daily Archive: November 19, 2026

కేఎల్‌ఐ కాల్వ పక్కన రక్షణ గోడ కరువు.. ప్రమాదం అంచున రహదారి!

కల్వకుర్తి, నవంబర్ 18: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ నుంచి శ్రీరామ్ నగర్‌కు వెళ్లే రహదారి పక్కన ఉన్న కేఎల్‌ఐ కాలువ ప్రమాదకరంగా మారింది. కాలువ నిండుగా నీరు ప్రవహిస్తుండగా, రహదారికి ఆనుకుని ఉన్న కాలువ వైపు ఎలాంటి రక్షణ గోడ లేదా కంచె లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ మార్గంలో నిత్యం పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు వృద్ధులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం…

అత్తాపూర్ పోలీసుల మెరుపు వేగం గంటలోపే చిన్నారి ఆచూకీ లభ్యం.

చిన్నారి సబ్రీన్ ఖాతూన్ కేవలం గంట వ్యవధిలోనే సురక్షితంగా తన తల్లిదండ్రుల చెంతకు చేరింది.

ముఖ్యమంత్రిని కలిసిన కొత్త హైదరాబాద్ సీపీ

బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మహేష్ భగవత్, బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

యాసీన్ ప్రైమ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR

పరిగి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాసీన్ ప్రైమ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే  ఆసుపత్రిని ప్రారంభించి, ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS బుధవారం పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, ఆవరణ పరిశుభ్రత, పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, NDPS కేసులకు సంబంధించి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర…

విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేసిన పాఠశాల ఉపాధ్యాయులు,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తింపు కార్డులను అదే పాఠశాలలోఉపాధ్యాయులుగా పనిచేస్తున్న,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ అందజేశారు.ఒకవైపు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ,మరోవైపు స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సామాజిక చైతన్యం, విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందించడం ద్వారా వారిలో…