విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాడి.. తల్లిదండ్రుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 29:కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలోని విజ్డమ్ మాంటిస్సోరి పాఠశాలలో విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పాఠశాల ప్రిన్సిపాల్ చెరుకూరి శ్యామ్ కుమార్ విద్యార్థి సోఫియాన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయాలైనట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై దాడులకు పాల్పడటం ఏమిటని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఘటనపై అధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1001411805.jpg

You may also like...