Daily Archive: November 26, 2026

అచ్చంపేటలో భూమిపూజకు వెల్దండ నుంచి భారీగా బయలుదేరిన గిరిజన శ్రేణులు

వెల్దండ,నవంబర్ 26:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్న నేపథ్యంలో వెల్దండ మండల గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.మండలం నుంచి గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులు బయలుదేరిన బస్సును వెల్దండ సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి, వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో…

రాజ్యాంగ విద్య తప్పనిసరి చేయాలి: గురుకుల ఉపాధ్యాయుడు జి. శివ కిషోర్

జ్ఞాన తెలంగాణ, నవంబర్ 26: విద్యార్థులకు వృత్తి విద్యతో పాటు పౌర బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించేందుకు భారత రాజ్యాంగ విద్యను అన్ని విద్యా స్థాయిల్లో తప్పనిసరి చేయాలని ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఉపాధ్యాయుడు జి. శివ కిషోర్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, వైద్య, ఫార్మసీ, సైన్స్ తదితర కోర్సుల్లోనూ రాజ్యాంగ విద్యను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. ప్రాథమిక హక్కులు, పౌర విధులు, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం…