కొట్రలో ఆధ్యాత్మిక వైభవం.. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన!

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి

1001412955.jpg

వెల్దండ: మండల పరిధిలోని కొట్ర గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభంతో పాటు గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నందీశ్వరుల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కాయితి కమల కాంతారావు తన సొంత ఖర్చులతో ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.

You may also like...