అంగన్వాడీ టీచర్ దొబ్బల చంద్రకళకు సిల్వర్ అవార్డు

1001269529.jpg

కల్వకుర్తి అక్టోబర్ 16 :మిషన్ బాల ఉదయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వెల్దండ మండలం చెరుకూరు సెక్టార్ పరిధిలోని చౌదర్‌పల్లి అంగన్వాడీ టీచర్ దొబ్బల చంద్రకళకు సిల్వర్ అవార్డు, ప్రశంసా పత్రం లభించాయి. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో చంద్రశేఖర్ అవార్డును అందజేశారు.అంతకుముందు జిల్లా కార్యాలయంలో అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ, పోషణ అభియాన్ విజ్ఞాన్, పర్యవేక్షకులు వనజ, సరితారెడ్డి, లక్ష్మి, వివిధ సెక్టార్ల పర్యవేక్షకులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

You may also like...