విద్యా సేవలో చిరస్మరణీయం.. పూస నిర్మలకు ఘన సత్కారం
- పీఆర్టీయూ కి షాక్…!టీఆర్టీఎఫ్కు కొత్త బలం - November 29, 2026
- విద్యా సేవలో చిరస్మరణీయం.. పూస నిర్మలకు ఘన సత్కారం - November 29, 2026
- విదేశీ ఉద్యోగాలకు భారీ సబ్సిడీ - November 27, 2026

ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోషల్ అసిస్టెంట్‌గా పనిచేసిన పూస నిర్మల పదవీ విరమణ సందర్భంగా హయత్‌నగర్‌లోని అనన్య రిసార్ట్‌లో ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కుషాల్ జామ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సామా రామ్మోహన్ రెడ్డి, IFEA ఉపాధ్యక్షులు కావాలి అశోక్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా రాజు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఆఫ్జాల్, శంకర్పల్లి అధ్యక్షులు తలారి నర్సింలు, మల్లేష్ నారాయణ తదితరులు హాజరయ్యారు. పూస నిర్మల సేవలను కొనియాడుతూ, ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఆమె నిలిచారని ప్రశంసించారు. ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ ఆత్మీయంగా సత్కరించారు.
