Author: MALLEPAKULA JANGAIAH

తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఔదార్యం

వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన మల్లోజు మంజుల ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి అండగా ఉంటానని, ఇంటి నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు భవిష్యత్తులోనూ అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, నాయకులు బుచ్చిబాబు, గూళ్ల వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

LPL-5 విజేతగా టైగర్ టైటాన్స్

లింగారెడ్డిపల్లి / వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన LPL-5 (లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ – 5వ సీజన్) క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి కిసాన్ సెల్ అధ్యక్షులు మల్లేపల్లి పార్వత్ రెడ్డి గారు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ టోర్నీలో సంతోష్ నాయకత్వంలోని టైగర్ టైటాన్స్ జట్టు ప్రథమ బహుమతిని కైవసం…

కల్వకుర్తిలో రావణ దహన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి – ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

దసరా పండుగ వేడుకల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.తన స్వగ్రామం నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న దసరా వేడుకలకు హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన సీఎం గారికి స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రజలందరికీ…

లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆడపడుచుల బతుకమ్మలతో దసరా సంబురాలు

వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ ఆడపడుచులు బతుకమ్మలతో ఆడిపాడి, అనంతరం జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, గ్రామ పెద్దలు రాఘవ రెడ్డి, నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి, మైల అల్వాల్ రెడ్డి, మైల హనుమంత్ రెడ్డి, మైల సుధాకర్ రెడ్డి, మల్లేపాకుల శేఖర్, పబ్బు శ్రీకాంత్, వార్డు సభ్యులు వట్టేపు అల్లాజి,…

వెల్దండలో బాధితురాలిని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ : వెల్దండ మండల కేంద్రానికి చెందిన నాగిళ్ల భారతమ్మ ఇటీవల గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అనంతరం తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దండ…

లింగారెడ్డిపల్లిలో ఘనంగా LPL-5వ సీజన్ ప్రారంభం

వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ (LPL) 5వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ నిర్వాహకులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మైలా అల్వాల్ రెడ్డి గారు, మైలా హాన్మంత్ రెడ్డి గారు, గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సర్పంచ్ ల సంఘం…

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో రెవెన్యూ రీ-సర్వే పనుల పరిశీలన

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రీ-సర్వే లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన లింగారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. చెన్నయ్య గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వేయర్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్వే లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితత్వంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి, రీ-సర్వే…

రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేపు మహేశ్వరంలో OBC భారీ సభ

జాతీయ జనగణనలో OBC కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 04-10-2026 ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మహేశ్వరంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూడవత్ హరికిషన్ నాయక్ పిలుపునిచ్చారు.భావి భారత ప్రధాని గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, కల్వకుర్తి అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారి సూచనతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.జాతీయ OBC చైర్మన్ గౌరవ…

లింగారెడ్డి పల్లి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

వెల్దండ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు.ఈ సభలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను వివరించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటిని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు….

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

కల్వకుర్తి నియోజకవర్గం :మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం కర్మన్‌ఘాట్‌లో ఘనంగా నిర్వహించారు. భారాస కల్వకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి జైపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారాస సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారితో ఓటు…