​దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి ​న్యాల్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి తెలిపారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాల్లో ప్రాతినిధ్యం తగ్గి రాజకీయంగా తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉండకూడదని పేర్కొన్నారు.

​ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపులను మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అలాగే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పునర్విభజనతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు

You may also like...