రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి…
కామారెడ్డి జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి బిసి బాయ్స్ హాస్టల్ ఎల్లారెడ్డి నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్ల సురేందర్ మాట్లాడుతూ పూలే దంపతులిద్దరూ భారతదేశంలో మొట్టమొదటగా వెనుకబడిన తరగతులు మరియు ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డారని, అస్పృశ్యత నివారణ కోసం పనిచేశారని, కుల నిర్మూలన కోసం పనిచేశారని, బాల్య వివాహాల రద్దు కోసము, వితౌంతులు పునర్వివాహం కోసము, సత్యశోధక్ సమాజ్ ద్వారా మంత్ర తంత్రాలు అవసరం లేకుండా కులాంతర, ప్రేమ వివాహాలు, దండల పెళ్లిలు చేశారని, సాంప్రదాయ విద్యను స్వస్తి పలికి శాస్త్రీయ విద్యను బోధించాలని పూలే సూచించారని, ఆరోగ్యం కోసం వ్యాయామం చేసేవారని, తన మిత్రులు ముస్లింలతో, మరియు క్రిస్టియన్లతో సోదర భావంగా ఉన్నారని, ఆ మహానీయుని ఆశయ సాధన కోసము తెలంగాణ రాష్ట్రంలో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు వెలిశాయి. అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ పేరు పెట్టారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో, హాస్టల్ వార్డెన్ శ్యామ్, పోచయ్య, బిసి సంఘం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు దండగుల లింగమయ్య, అజయ్, అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు మర్లు సాయిబాబా, మండల అధ్యక్షులు మ్యాథరి అమృతరావు, సలహాదారు మెగావత్ కనిరామ్, సంఘ సభ్యులు కొక్కొండ ముత్యం, మహేందర్, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.