జూపల్లిలో ఎమ్మెల్యే కసిరెడ్డికి ఘన సన్మానం

1001413191.jpg

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 29 : జూపల్లి గ్రామ పర్యటనకు విచ్చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని జూపల్లి గ్రామ సర్పంచ్ అనూష జగపతి, చారకొండ మండల అఖిల భారత యాదవ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జూపల్లి భాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండీ సిరాజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

You may also like...