ఘనంగా జననేత దశరథ్ జన్మదిన వేడుకలు
- మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పర్వేద వార్డు మెంబర్ రవి - August 21, 2026
- ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత - August 21, 2026
- మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - August 21, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 20: కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల మాజీ జెడ్పిటిసి, రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరత్ నాయక్ జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ సత్యంల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, సమాజ సేవకు అంకితం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం పై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
జన్మదినాన చాటుకున్న పుత్రప్రేమ, భక్తిభావం:
ఆలయాల అభివృద్ధికి రూ. 12 లక్షలు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేతులు మీదుగా అందజేయడం జరిగింది.ఆడంబరాల పుట్టినరోజు వేడుకలకు స్వస్తి పలికి.. కడుపున పుట్టిన కొడుకు జ్ఞాపకాలను పదిలం చేస్తూ, దైవకార్యానికి భారీ విరాళం ప్రకటించి నిఖార్సైన మానవత్వాన్ని చాటుకున్నారు కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలు అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో, సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి.తన దివంగత కుమారుడు రాధాకృష్ణ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన “రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్” ద్వారా కడ్తాల్ మండలంలోని వివిధ దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనుల కోసం ఆయన ఏకంగా 12 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, ఆ మొత్తాన్ని దేవాలయాల ప్రతినిధులకు అందించారు.కొడుకు జ్ఞాపకార్థం.. ఆధ్యాత్మిక సేవలో..పుత్రశోకాన్ని గుండెల్లో దాచుకుని,ఆ రాధాకృష్ణ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలనే సంకల్పంతో దశరథ్ నాయక్ ఈ ట్రస్ట్‌ను స్థాపించారు.తన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని పురాతన,ప్రముఖ దేవాలయాల మౌలిక వసతుల కల్పనకు,ధూపదీప నైవేద్యాలకు ఈ 12 లక్షల రూపాయల నిధులను కేటాయించారు.ఒక ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజల్లో ఉండే దశరథ్ నాయక్ , దైవకార్యానికి ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం ఆయనకున్న భక్తిశ్రద్ధలకు,సేవా నిరతికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు.పలువురు ముఖ్య నేతలు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.దశరథ్ నాయక్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని వారు ఆకాంక్షించారు.ఈ నిధులతో మండలంలోని ఆలయాలకు పూర్వవైభవం రానుందని ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు మాజీ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ వైస్ ఎంపీపీలు సర్పంచులు మాజీ ఎంపిటిసిలు మాజీ ఉపసర్పంచ్లు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దశరథ్ నాయక్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

