Daily Archive: November 25, 2026

వడ్ల దొంగల ముఠా అరెస్ట్

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో వడ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి వేళల్లో కల్లాల్లోని వడ్లు చోరీ చేసి జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 37 వడ్ల బస్తాలు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

మొగుడంపల్లిలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ కరపత్రాల పంపిణీ

మొగుడంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. పథకం ద్వారా ప్రతి కుటుంబానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.​ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ రాథోడ్,…

కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా వర్తించాలి

కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా వర్తించాలి.జ్ఞాన తెలంగాణ /డిండి ప్రతినిధి: ఇందిరమ్మ బీమా పథకం ఇంటిలో ఒక్కరికే కాకుండా రేషన్ కార్డులో ఉన్నటువంటి  ప్రతి కుటుంబ సభ్యులకి వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాంపల్లి హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ జీవిత బీమా పథకం రేషన్ కార్డులో ఉన్నటువంటి వారిలో ఒకరికే కాకుండా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ…

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఫీజు బకాయిల సమస్యను పరిష్కరించాలంటూ నిరసనకారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. విద్యార్థులతో కలిసి బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య...

దిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురిపై కేసు

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ప్రీత్ విహార్ ప్రాంతంలోని ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు...

రేపు అచ్చంపేటలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ప్రముఖ మద్దిమడుగు ఆలయ అభివృద్ధి పనులకు...

మొమిన్‌పేట్ యూబీఐ బ్యాంక్ మేనేజర్ టేకులపల్లి గ్రామం పర్యటన మరియు ప్రత్యేక సమావేశం

మొమిన్‌పేట్ మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో యూబీఐ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో   ఫైనాన్సియల్  ఇన్క్లూసివ్  అవేర్నెస్ ప్రోగ్రామ్ లో బాగంగా  గ్రామస్థులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా రైతులు మరియు మహిళలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ సమావేశంలో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బ్యాంక్ పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇస్తున్న…

కేతకీ ఆలయంలో కల్యాణోత్సవం కార్తీక పౌర్ణమి వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యే

ఝరాసంగం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం పార్వతీ సంగమేశ్వరుల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో పార్వతీ సంగమేశ్వరుల ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వెనుక ఉన్న అమృతగుండంలో దీపారాధన నిర్వహించారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు…

కేతకీ అమృతగుండంలో గంగా హారతి

ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం పార్వతీ సంగమేశ్వరుల కల్యాణాన్ని భక్తుల జయజయ ధ్వానాల మధ్య నిర్వహించారు. రాత్రి 8:15 గంటలకు ఆలయం వెనుక ఉన్న అమృతగుండంలో అర్చకులు గంగా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్, ఆలయ ఈవో శివరుద్రప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.ఉదయ శంకర్ పాటిల్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు హన్మంత్…

దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు.. డిసెంబర్ 11లోగా దరఖాస్తు చేసుకోండి!

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి: జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రూప్‌-4 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్, కుక్, కామటి, వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ నెల 25 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు…