జ్యోతినగర్ కాలనీ నాలుగో వార్డులోని ఫేస్-2లో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

జనగామ పట్టణంలోని స్థానిక నాలుగో వార్డులోని జ్యోతినగర్ కాలనీ ఫేస్-2లో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కాలనీ పెద్దలు భోనగిరి మల్లికార్జున్ దంపతులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఏడాది కూడా ఘనంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మశ్రీ కాసోజు రాజేశ్వరాచార్యులు పండితుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ కుటుంబ సభ్యులు, నగేశ్ స్వామి, మహేష్ స్వామితో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు, కాలనీ వాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా, భక్తులు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.asdf.jpeg

You may also like...