తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే దిక్సూచి.. గోలి శ్రీనివాస్ రెడ్డి
- జూపల్లిలో ఎమ్మెల్యే కసిరెడ్డికి ఘన సన్మానం - November 29, 2026
- తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే దిక్సూచి.. గోలి శ్రీనివాస్ రెడ్డి - November 29, 2026
- కొట్రలో ఆధ్యాత్మిక వైభవం.. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన! - November 29, 2026
దీక్షా దివస్‌లో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం మరువలేనిదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని జేఏసీ శిబిరం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు విజయగౌడ్ అధ్యక్షతన దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలని ఆకాంక్షించారు.అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్, మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, సర్పంచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
