రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) నాటి దీక్ష ఫలితమే 2014లో తెలంగాణ రాష్ట్ర నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు…
కామారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమ చరిత్ర తిరగేసిన రోజు నవంబర్ 29 దీక్షా దివాస్ అనిమాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం కామారెడ్డి జిల్లా ఈఎస్ఐ ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించి జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో ప్రసంగించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో దీక్షా దివస్ ముఖ్య భూమిక చరిత్రలో నిలిచిందని అన్నారు. తెలంగాణ నలువైపులా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ దీక్ష చేసి ఉద్యమం స్పీడ్ పెంచిందని అన్నారు.
కెసిఆర్ అలుపెరుగని పోరాటమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ఉంటానలేని మాటలతో అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ యువతను బలి తీసుకున్న నీచపు చరిత్ర కాంగ్రెస్ అని. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబ్ మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాయాలు తెలంగాణ ఉద్యమం చేసినప్పటికి సమైక్య ఆంధ్రుల చేతిలో అనుగదొక్కాలని చేశారు. నవంబర్ 29 తెలంగాణ ఉద్యమానికి దీక్ష దివాస్తో కెసిఆర్ చేసిన త్యాగ ఫలితమే ఢిల్లీ పాలకులు, ఆంధ్ర పాలకులు మేలుకునే విధంగా ఉద్యమం ఉదృతం అయిందని గుర్తు చేశారు. నాటి దీక్ష ఫలితమే 2014లో తెలంగాణ రాష్ట్ర నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కార్యకర్తలు నాయకుల సమక్షంలో అట్టహాసంగా దీక్షా దివాస్ చేశారు.