Daily Archive: November 29, 2026
డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు ప్రాతినిధ్యంలో నష్టం కలగకుండా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శివ జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ గాదె శివ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, శిశు మరణాల తగ్గింపు, సామాజిక సమానత్వం, ఆర్థిక అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక గ్రాంట్లు, అభివృద్ధి నిధులు కేటాయించాలన్నారు. జాతీయ లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలను ఆర్థికంగా ప్రోత్సహించాలని, దక్షిణాది…
దూలపల్లి పారిశ్రామిక వాడలో ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధి పేరుతో 80 పరిశ్రమలను తొలగించే హైడ్రా చర్యలను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. 25 ఏళ్లుగా ప్రభుత్వ అనుమతులతో కొనసాగుతున్న పరిశ్రమల్లో సుమారు 5 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. హైడ్రా కోర్టు ఆదేశాలు, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని, ప్రజలపై దౌర్జన్యం చేయడం సరికాదని హితవు పలికారు. బాధిత పారిశ్రామికవేత్తలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132వ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎం.ఎన్.రెడ్డి నగర్లో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన దేవాలయాల పునర్నిర్మాణం 100 నూతన దేవాలయాల నిర్మాణాలతో సమానమని పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాల కొనసాగింపు ఎంతో ముఖ్యమని, కాశీ విశ్వేశ్వర స్వామి కృపాకటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్,…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముర్తుజపూర్ సాల్మన్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపులను మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మహిళలకు…
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 29 : జూపల్లి గ్రామ పర్యటనకు విచ్చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని జూపల్లి గ్రామ సర్పంచ్ అనూష జగపతి, చారకొండ మండల అఖిల భారత యాదవ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జూపల్లి భాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండీ సిరాజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి…
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహానేత కేసీఆర్ నకిరేకల్ మాజీ చిరుమర్తి లింగయ్యకట్టంగూర్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిందని, ఆ పోరాటం యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి…
రంగారెడ్డి,వెబ్ డెస్క్ :పీఆర్టీయూ టీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి వందలాది మంది ఉపాధ్యాయులతో టీఆర్టీఎఫ్లో చేరారు. కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి సభ్యత్వం అందజేసి స్వాగతించారు. అనంతరం రాష్ట్ర చీఫ్ అడ్వైజర్‌గా నియమిస్తూ...
దీక్షా దివస్‌లో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డికల్వకుర్తి రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం మరువలేనిదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని జేఏసీ శిబిరం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు విజయగౌడ్ అధ్యక్షతన దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ…
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,కూచుకుళ్ల రాజేష్రెడ్డివెల్దండ: మండల పరిధిలోని కొట్ర గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభంతో పాటు గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నందీశ్వరుల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కాయితి కమల కాంతారావు తన సొంత ఖర్చులతో ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించడం…
వెల్దండ నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఒక కీలక ఘట్టమని తెలంగాణ ఉద్యమకారిణి, కల్వకుర్తి మాజీ బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ విజితా రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి, వెల్దండ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం తెలంగాణ ఉద్యమ ఘట్టాల ఫొటో…