ఆలయ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132వ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎం.ఎన్.రెడ్డి నగర్‌లో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన దేవాలయాల పునర్నిర్మాణం 100 నూతన దేవాలయాల నిర్మాణాలతో సమానమని పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాల కొనసాగింపు ఎంతో ముఖ్యమని, కాశీ విశ్వేశ్వర స్వామి కృపాకటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్, కాలనీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, శివరాం రెడ్డి, రాము, శంకర్, భరత్, కిరణ్ కుమార్, హరి కిరణ్, కేపీకే ప్రసాద్, చంద్రశేఖర్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీ మోహన్ తదితరులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...