Daily Archive: November 29, 2026

విద్యా సేవలో చిరస్మరణీయం.. పూస నిర్మలకు ఘన సత్కారం

ఉప్పల్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సోషల్ అసిస్టెంట్‌గా పనిచేసిన పూస నిర్మల పదవీ విరమణ సందర్భంగా హయత్‌నగర్‌లోని అనన్య రిసార్ట్‌లో ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కుషాల్ జామ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ...

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా అధికారులు

ఝరాసంగం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి లలితాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు అధికారులకు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం ఎంఈఓ శ్రీనివాస్,ఎంపీడీఓ. సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్ శివ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

బాలికల హక్కుల రక్షణ అందరి బాధ్యత మాట్లాడుతున్న జిల్లా విద్య అధికారి రోహిణి

ఝరాసంగం మండల మండలంలోని కుప్పానగర్  బాలికల రక్షణ, విద్య, సమాన హక్కుల కల్పన ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని జిల్లా విద్యాఆధికారిణి రోహిణి అన్నారు.శనివారం మండల పరిధిలోని కుప్పనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బాలికకు నాణ్యమైన విద్యతో పాటు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు.కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లలితకుమారి, ఎం ఈవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్…

విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాడి.. తల్లిదండ్రుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 29:కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలోని విజ్డమ్ మాంటిస్సోరి పాఠశాలలో విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పాఠశాల ప్రిన్సిపాల్ చెరుకూరి శ్యామ్ కుమార్ విద్యార్థి సోఫియాన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయాలైనట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై దాడులకు పాల్పడటం ఏమిటని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఘటనపై అధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై…