పార్లమెంటు ప్రాతినిధ్యంలో రాజ్యాంగ రక్షణ కల్పించాలి

డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు ప్రాతినిధ్యంలో నష్టం కలగకుండా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శివ జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ గాదె శివ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, శిశు మరణాల తగ్గింపు, సామాజిక సమానత్వం, ఆర్థిక అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక గ్రాంట్లు, అభివృద్ధి నిధులు కేటాయించాలన్నారు. జాతీయ లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలను ఆర్థికంగా ప్రోత్సహించాలని, దక్షిణాది రాష్ట్రాలు సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌ను కేవలం ఎంపీ స్థానాల పెంపుగా కాకుండా అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు న్యాయం చేసే సమాఖ్య సంస్కరణగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

You may also like...